
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
తాడిపత్రి రూరల్ పరిధిలోని చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సంచార చికిత్స నోడల్ అధికారి డాక్టర్ ఎస్.బి విష్ణుమూర్తి “స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర” కార్యక్రమంలో భాగంగా చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఆకస్మిక తనిఖీ చేశారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులు, ల్యాబ్, మరియు బయోమెడికల్ వేస్టేజ్ అమలు విధానం గురించి ఆరా తీసిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు.. “స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర” కార్యక్రమం ప్రతినెల మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలలో అమలు చేయాలని సిబ్బందికి సూచించారు..హైపోక్లోరైడ్ ద్రావణం ఎలా తయారు చేయాలో సిబ్బందికి అవగాహన కల్పించారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోగుల యొక్క వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ లావణ్య,కేశవానంద, సూపర్వైజర్లు ఎంపీ నారాయణ, హేమలత మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు…