
▪యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు పిర్యాదు..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 25 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ : ఈ నెల 27న ఎలుకతుర్తి వద్ద నిర్వహించనున్న టిఆర్ఎస్ రజితోత్సవ సభకు రోడ్లకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లకు గులాబీ రంగు పూసి పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని వెంటనే గులాబీ రంగు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. ఇ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాష్ట్ర సమితి ఎల్కతుర్తి సమావేశానికి ప్రచార నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామం నుండి చిన్నపాపయ్యపాలి గ్రామం వరకు అలాగే పరకాల క్రాస్ రోడ్ నుండి కందుగుల గ్రామం వరకు రహదారులకు ఇరువైపుల గల చెట్లకు టిఆర్ఎస్ పార్టీ గులాబీ రంగు ప్రచారం వేసి పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా చేస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని పార్టీ సమావేశానికి వాడుకొని చెట్లకు అన్నిటికీ గులాబీ రంగు వేయడం జరిగిందని అ రంగులో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల చెట్లు చనిపోయే ప్రమాదం ఉందని ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసువాలని యువజన కాంగ్రెస్ నాయకులు హుజూరాబాద్ ఎంపీడీవో కి పిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీ చెట్లకి వేసిన గులాబీ రంగుని తొలగించి చెట్లకి తెల్ల సున్నం వేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్, నియోజికవర్గ కార్యదర్శి ఉమ్మడి సందీప్, హుజురాబాద్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్, ఇల్లంతకుంట మండల ఉపాధ్యక్షులు వాలసాని సుమన్, జమ్మికుంట బీసాడి వంశీ కృష్ణ పాల్గొన్నారు.