
పయనించే సూర్యుడు గాంధారి 18/03/25 ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆదేశాల మేరకు గాంధారి మండలం ఛద్మల్ గ్రామం ఉన్నత పాఠశాల నందు కళాబృందం ప్రోగ్రాం నిర్వహించనైనది. కార్యక్రమములో డ్రగ్స్, షీటీం, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించనైనది. షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి వినియోగించుకోవలేనని చెబుతూ, అత్యవసర పరిస్థితుల toll free numbers 100, 108, 1930, 181 ల విలువలు తెలుపనైనది. ప్రతి మహిళ ఫోన్ నందు T -Safe app డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మహిళలకు చాలా అత్యవసరమైనది అని తెలుపడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు ద్విచక్ర వాహనము నడిపితే ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వారికి తెలుపడనమైనది మరియు మాదకద్రవ్యాల వినియోగాన్ని అందరూ మానుకోవాలని తెలియజేయడం జరింగింది. ఈ కార్యక్రమంలో మరియు పాఠశాల హెడ్మాస్టర్ చంద్రశేఖర్ మరియు గాంధారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.