
మండల సాయిబాబా ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ఫ్యాన్లు పంపిణీ..

పయనించే సూర్యడు // మార్చ్ // 20 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
ఈటల రాజేందర్ పుట్టిన రోజు సందర్బంగా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో మండల సాయి బాబా ఆధ్వర్యంలో చెల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా మండల సాయి బాబా మాట్లాడుతూ… చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని 10 వ తరగతి తోనే భవిష్యత్ కు తొలిమెట్టని అన్నారు. అదే విధంగా పదవ తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే గత పది సంవత్సరంలో చెల్పూర్ ప్రభుత్వ పాఠశాల అగ్రగామిగా నిలుస్తుంది అని అదే స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో నీలిచేలా చదవాలి అని ఆకాంక్షించారు. అదే విధంగా 10/10 సాధించిన విద్యార్థులకు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పంజాల వెంకన్న, లక్ష్మి, లావణ్య, ప్రవీణ్,శ్రీనివాస్ ప్రశాంత్,రవి, రమేష్, శివ గ్రామ యువకులు పాల్కొన్నారు.