
పయనించే సూర్యుడు జనవరి 21 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి)… రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా చేజర్లలో ఎస్సై తిరుమలరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి చేపట్టిన ర్యాలీ విశేషంగాజరిగింది.ర్యాలీ విద్యార్థులు తమ స్లోగన్లతో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ర్యాలీ ప్రారంభం నుండి ముగింపు వరకు పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమానంగా పాల్గొని ఉత్సాహాన్ని పెంపొందించారు.ఈ సందర్భంగా ఎస్సై తిరుమలరావు మాట్లాడుతూ,రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,ఆచరణలో పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని గుర్తుచేశారు.ప్రత్యేకంగా హెల్మెట్ ధరించడం,ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, నిర్దేశిత వేగ పరిమితిలోనే ప్రయాణించడం వంటి నియమాలు మన అందరి ప్రాణాలను కాపాడుతాయనిచెప్పారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.ర్యాలీ ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం మునుముందు పటిష్టమైన రోడ్డు భద్రతకు దోహదపడుతుందని భావిస్తున్నారు