
చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పలసాని ప్రసాద్
పయనించే సూర్యుడు ఆగస్టు 14 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ సెంటర్లో నూతనంగా నిర్మించబడిన ఎం జే ఎన్ మాదాల జనార్ధన్ నాయుడు షాపింగ్ మాల్ను చిత్తూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ పలసాని ప్రసాద్ విచ్చేయడం జరిగినది ఆయన సొంత మండలం అయినందున ఇటీవల నూతనంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేకపోయినందువలన ఈరోజు రావడం జరిగినది.చేజర్ల మండలంలోని పెరుమాళ్ళ పాడు గ్రామానికి చెందిన వ్యక్తి చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా విధులు నిర్వర్తించడం మాకు చాలా ఆనందమని షాపింగ్ మాల్ ఓనర్ మాదాల జనార్దన్ నాయుడు తెలిపారు.అలాగే చిత్తూరు నగరపాలక సంస్థ పలసాని ప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించబడిన ఎం జేఎన్ షాపింగ్ మాల్ ముందు ముందు ఆర్థికంగా మరింత బలోపేతంగా ఎదగాలన్నారు కస్టమర్లకు అందుబాటులో ఉండి ఆకర్షణీయమైన నాణ్యమైన వస్త్రాలతో ప్రజలను మరింత ఆకర్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం దేవతి రమేష మాదాల కమలేష్ వేమన మహేష్ అజ్మీర భాను తేజ తదితరులు పాల్గొన్నారు
