
పయనించే సూర్యుడు జూలై 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని గురువారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కే. శోభారాణి గురువారం తనిఖీ చేశారు. హాస్టల్లో జరుగుతున్న మరమ్మత్తులను, విద్యార్థులు వసతి సౌకర్యాలను పరిశీలించి మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. పేద విద్యార్థులందరూ వసతి గృహంలో వసతి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పొదలకూరు సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సిహెచ్ సుధామణి, వసతి గృహ సంక్షేమ అధికారి ఎం సుధాకర్ తదితరులు ఉన్నారు.