
మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
చేవేళ్ల మీర్జాగూడ వద్ద బస్సు రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు చనిపోవడం చాలా బాధాకరం అని బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్తిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రమాదంలో గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి
మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు..