టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
కొందుర్గు మండలం ఆగిరాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంటు
(పయనించే సూర్యుడు జనవరి 21 రిపోర్టర్ రవీందర్ )… కొందుర్గు మండలం ఆగిరాల గ్రామంలో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ సీసన్-2 క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.అనంతరము ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలలో పట్టు సాధించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని ప్రారంభోత్సవ సందర్భంగా తెలిపుతూ మనిషి సాధించాలనుకుంటే కానిదేది లేదన్నట్లు క్రీడాకారులుగా క్రీడలపై ఇష్టం పెంచుకొని ఆడితే గ్రామస్థాయి నుండి జిల్లా రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ స్థాయికి రాణించవచ్చని తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలో క్రీడలపై మక్కువ పెంచుకుంటున్న క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొందుర్గు వైస్ ఎంపిపి రాజేష్ పటేల్ ,కొందుర్గు జెడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ,కొందుర్గు బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కొందుర్గు మాజీ ఎంపిపి తనయుడు పోతురాజు గోపాల్,
పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాదేవ్పూర్ రవిందర్ రెడ్డి,పార్వత పూర్ మాజీ సర్పంచ్ బాల్వంత్ రెడ్డి,ఆగిరాల మాజీ సర్పంచ్ భీమయ్య,ఎంకిర్ యాల్ మాజీ సర్పంచ్ గోవింద్,తంగేలపల్లి మాజీ సర్పంచ్ బాల్ రాజు,చెరుకుపల్లి మాజీ సర్పంచ్ ప్రేమ్,మాదేవ్ పూర్ మాజీ సర్పంచ్ రాం చెంద్రయ్య, గంగనాగూడ మాజీ సర్పంచ్ శేఖర్,చిన్నఎలికి చెర్ల మాజీ సర్పంచ్ శేఖర్,
అయోధ్యపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్,జిల్లెడ్ చౌదరి గూడ మండలం సర్పంచ్ల సంగం ప్రెసిడెంట్ బాబురావు, బిఆర్ఎస్ నాయకులు బాల్ రాజు,లింగం గౌడ్,ఖలాం,తెలంగాణ రమేష్,మహేష్ యాదవ్,గొడుగు సత్యం,సారా శివయ్య, అనంతయ్య,శేఖర్ గౌడ్,ప్రవీణ్, ఉప్పరి సత్యం చెంద్రయ్య, పెరుమల్ రెడీ,రాజు, దినేష్ సాగర్,గుట్ట రాజు, సుదీర్,మధు ఆర్గ నైసర్లు, క్రీడాకారులు,యువకులు తదితరులు పాల్గొన్నారు