
పయనించే సూర్యుడు మార్చి 07 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందుగత నెల 27 న జగిత్యాల జిల్లా వడ్డేలింగాపూర్ కు చెందిన ఆశా వర్కర్ దుబ్బ రాజన్న జాతర సందర్భంగా విధులు నిర్వహించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఓ వ్యక్తి ఆమెను బెదిరించి లౌంగిక దాడికి పాల్పడ్డాడు. ఇట్టి విషయమై ఆశా వర్కర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నిందితున్ని అరెస్టు చేయకపోవడంతో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలకు సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఇల్లందు పెట్రోల్ బంక్ సెంటర్ నందు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లే కార్డులు ప్రదర్శించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన నిందితుని కఠినంగా శిక్షించి జైలుకు పంపాలని ఆశ వర్కర్ కు నష్టపరిహారం 10 లక్షలు చెల్లించాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, ఆశ యూనియన్ జిల్లా నేత గందసిరి ఉమా దేవి, తాళ్లూరి కృష్ణ, లు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నజీమా,అరుణ, పద్మ,రామ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.