
పయనించే సూర్యుడు న్యూస్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ 1 తేదీ మే నర్వ మండలం
ఈరోజు హైదరాబాద్, నాంపల్లి లోని బీజేపీ కార్యాలయంలోని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. ఈ సందర్భముగా లక్ష్మికాంత్ రెడ్డి మాట్లాడుతూ,కుల,జన గణన చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయంలో ఎవరి ప్రమేయం లేదని,కాంగ్రెస్ నాయకులు గొప్పులు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని, దేశంలో జనగణన, కులగణన బాధ్యత పూర్తిగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీగారిదేనని, ఇలాంటి నాయకుడు భారతావనిలో జన్మించడం మన అదృష్టమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతం నుంచి కూడా కుల గణనను వ్యతిరేకించాయని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన నిర్వహించినప్పటికీ.. ఆకార్యకలాపాలలో కులాన్ని చేర్చలేదని,2010లో అప్పటి ప్రధానమంత్రి దివంగత డాక్టర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారు కుల గణన అంశాన్ని క్యాబినెట్‌లో పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి కూడా. కాంగ్రెస్ పార్టీలాగ ఓట్లు, సీట్ల కోసం మేము పాకులాడమని,గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలోనూ INDI కూటమి ఈ కులగణన అంశాన్ని రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకుందని దుయ్యబట్టిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు ఏం చేయాలో,ఎలా చెయ్యాలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని, కుల గణన, జన గణన పారదర్శకంగా నిర్వహిస్తాంమని,ఇదేధో కాంగ్రెస్ వాళ్లు చెబితే చేసే పనికాదని తెలియజేసారు.కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా దేశంలో జన, కుల గణను చేపట్టాలని నిర్ణయించిందిని,కుల గణన, జన గణన అన్నవి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలని తెలిజేశారు. కొందరు స్వార్థ పూరిత రాజకీయ నాయకులూ తమ స్వలాభం కోసం మేమే ముందుచేశాం, ఆదర్శం అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జన గణన ఎలా చేసిందో.. జనాలందరికీ తెలుసని, సొంతపార్టీ నేతలకే కాంగ్రెస్ జనగణనపై నమ్మకం లేదని,అవన్నీ దొంగలెక్కలనీ బహిరంగంగానే చెబుతుంటే.. మరో పక్క అది మా ఘనతంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని తెలియజేసారు. దేశ ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునే కేంద్ర ప్రభుత్వం కుల, జన గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందని, ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు, ఆర్భాటం తప్ప అని మాట్లాడిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్లకు అలవాటే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది మాక్రెడిటేనని చెప్పుకోవడం వాళ్లకు అలవాటేనని,కుల, జనగణన విషయంలో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని చెప్పారు. శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హామీలేవీ నెరవేర్చరు.. గ్యారంటీలన్నీ గాలికొదిలేసిండ్రు,అందుకే ఎలాగైనా ప్రజల మెప్పుపొందాలన్న యావలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఆ క్రెడిట్ పూర్తిగా మాదే దేశ ప్రజల నమ్మకాన్ని మేమెప్పుడూ వమ్ముచేయమని, మోదీ మాటంటే మాటే.. మడమ తిప్పం.. మాట తప్పం అని,మోదీ గారి గ్యాంరటీకి తిరుగులేదు.. బీజేపీకి ఎదురేలేదని,దేశంలోని జనగణ తోపాటు కుల గణన పట్టబోతున్నాంమని, దేశంలోని జన గణన,కులగణను పారదర్శకంగా చేపడతాంమని, త్వరలోనే జనగణలో కుల గణనను చేర్చి వాస్తవాలు ప్రజల ముందుంచుతాంమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తెలియజేసారు.