పయనించే సూర్యుడు జనవరి26 యూసఫ్:- జూలూరుపాడు లో మిడ్ డే మీల్స్ బంద్ నోటీసు ను అందించిన ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎస్ కె చాంద్ పాషా, రాష్ట్ర వ్యాప్తంగా, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 27వ తేదీన వంటలు బంద్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, డీఈవో కార్యాలయల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎస్ కె చాంద్ పాషా, తెలిపారు మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు బంద్ నోటీసు ను అంద చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోడిగుడ్లను ప్రభుత్వం ఐదు రూపాయలు చెల్లిస్తుంటే మార్కెట్లో ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేసి మూడు రూపాయలు నష్టపోటం జరుగుతుంది, ప్రభుత్వమే పూర్తిగా కోడిగుడ్ల ను సరఫరా చేయాలి, మార్కెట్ ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలు ప్రతి విద్యార్థులకు 25 రూపాయలు చెల్లించాలి వంట కార్మికుల ను తొలగించకుండా జిఓ ని రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పదివేల రూపాయలు జీతం వెంటనే చెల్లించాలి, వంట సందర్భంగా జరుగుతున్న ప్రమాదాలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, గత తొమ్మిది నెలలుగా 9,10 తరగతులు కోడిగుడ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలి, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమం లో ముదిగొండ లక్ష్మి, గడల మంగమ్మ, సుశీల వరలక్ష్మి సావిత్రి లలితా విజయ తదితరులు పాల్గొన్నారు
జనవరి 27న రాష్ట్రవ్యాప్తంగా వంట కార్మికుల వంటల బంద్ చేసి నిరసన, ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయండి
RELATED ARTICLES