
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరువూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. పయనించే సూర్యుడు మార్చి 16 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ,మరియు 10 వ వార్డు (పేట రామారావు బజార్ )లో గల జనసేన పార్టీ జెండా దిమ్మె వద్ద కూడా జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పసుపులేటి నరేష్ మిత్ర (పండు) ఉయ్యూరు జయప్రకాష్, లింగినేని సుధాకర్(అడ్వకేట్) పసుపులేటి రవీంద్ర ,రామిశెట్టి జగన్ ,పెరుమాళ్ళమనోజ్, బత్తుల వెంకటేశ్వరరావు, కస్తూరి ఓంకార్ కొలగాని సత్యనారాయణ, ఉయ్యూరు మీనా కుమారి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.