
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 13
జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు ప్రతి ఒక్కరికి ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం లో భాగంగా, విరామహిళా తీగల కవిత మాట్లాడుతూ, జనసేన పార్టీ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం లో విధి విధానాలను భావజాలని ఆశయాలను ప్రజలోకి తీసుకొని వెళ్లడంలో భాగస్వాములు అయినందుకు విలువైన సమయాన్ని పార్టీ కీ కేటాయించి నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక జనసైనికుడిగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజలోకి తీసుకొని వెలవలసిన బాధ్యత మీ పై ఉంది, మీరు తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం తో పాటుగా మీ కుటుంబానికి భరోసా కల్పించేలా 5లక్షల ప్రమాద జీవిత భీమా అందించడం జరుగుతుంది, అనుకోని ప్రమాదల సమయం లో మీ కుటుంబ సభ్యులకు ఆసరా గా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులు గా గౌరవ అధ్యక్షులు పెయ్యాలా నాగేశ్వరావు, మండల అధ్యక్షులు మడివి రాజు, ఉపాధ్యక్షులు తీగల రవి, ప్రధానకార్యదర్శి బేడే సతీష్, కారం దుర్గారావు, మహిళా విభాగం మీడియం రమణమ్మ, ఉయిక వెంకటేష్. మండల నాయకులు గణేష్, బాబీ, సుదీర్, తదితరులు పాల్గొన్నారు.