
పయనించే సూర్యుడు అక్టోబర్ 14,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న
జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ని కలసి మా జర్నలిస్ట్ హక్కులను కాపాడాలని కోరుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు..ఈ సందర్భంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ సోదరులకు నా తరఫున పూర్తి సహకారాలు ఉంటాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందిస్తానని, జర్నలిస్టుల సమస్యలపై జాతీయస్థాయిలో నిరంతరం పోరాడుతున్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు కృతజ్ఞతలు తెలియచేసారు.