పయనించే సూర్యుడు, జనవరి 26, అశ్వాపురం మండల రిపోర్టర్:- అధికారుల నిర్లక్ష్యం చేత జాతీయ జెండాకు అవమానం జరిగింది. అధికారుల నిర్లక్ష్య ధోరణికి వారికి ఎటువంటి శిక్ష వేస్తారు అని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామపంచాయతీలో పశు వైద్యశాలలో పశువైద్యాధికారిని ఫర్హీన్ జాతీయ జెండాను సమయపాలన పాటించకుండా ఎగరవేయటమే కాకుండా జెండాను తిరగలిగా ఎగురవేయడం జరిగింది. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి సమయపాలన పాటించకుండా వారి నిర్లక్ష్య ధోరణికి కనీసం జెండాని ఎలా కట్టాలో తెలియకుండా పోయింది. దీనిపై అధికారులు స్పందించి వెంటనే జెండాని అవమానించిన తీరుకు ఆ ఉద్యోగులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుకుంటున్నారు.