పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (12: జనవరి)(ఆదోని నియోజకవర్గం )
సర్వ మతాల సారం ఒకటే-పర మతాన్ని విమర్శించకు-స్వామి వివేకానంద
జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలో సిఐటియు కార్యాలయం ఆవురంలో నందు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వీరేష్ నాగరాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జనవరి 12, 1863 జన్మించారు. నేడు దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అలాంటివారికి స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజల మధ్య ఐక్యతను నింపడం సర్వ మతాలలోని ప్రజలందరినీ ముఖ్యంగా భారతదేశంలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని ప్రతిబింబించేలాగా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని మతోన్మాదులు రెచ్చగొట్టే ప్రసంగాలకు లోనై ప్రజల మధ్య సిచుపెట్టే వారి మధ్య జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. 1884లో బి.ఎలో ఉత్తీర్ణుడయ్యాడు. పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. నిదురపోతున్న భారతజాతిని మేల్కొల్పాడు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భరత్ కుమార్, నాగరాజు, సంజయ్, వెంకట్, సంతోష్, ఉత్తేజ్, రవితేజ డివైఎఫ్ఐ నాయకులు వెంకటేశులు, సతీష్ కుమార్, పవన్, తదితరులు పాల్గొన్నారు