ఎన్టీఆర్ జిల్లా :
ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై గంజాయి కలకలం. పయనించే సూర్యుడు జనవరి 27 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ.
బైకుపై ముగ్గురు యువకులు గంజాయి తరలిస్తూ ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీ కొట్టిన వైనం..బైక్ పై ఎదురుగా వస్తున్న భార్య భర్తలకు గాయాలు.. గాయపడిన భార్యాభర్తలను 108 అంబులెన్స్ లో తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. బైకుపై తరలిస్తున్న గంజాయితో పాటు బైకును వదిలేసి పరారైన యువకులు.. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. బైకును, మూడు గంజాయి బండిల్స్ ను స్వాధీనం చేసుకున్న ఏ.కొండూరు పోలీసులు.. గంజాయితో పాటు ఒక కత్తి కూడా బ్యాగులో ఉన్నట్లు పేర్కొన్న స్థానిక ప్రజలు..
జాతీయ రహదారిపై గంజాయి పట్టివేత.
RELATED ARTICLES