
పుడమి ఫౌండేషన్ వ్యవస్థాపక.చైర్మన్ వెంకటపతి రాజు
//పయనించే సూర్యుడు// జులై 10//మక్తల్
ఈ సందర్భంగా పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు గారు మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జాతీయ సార్వత్రిక సమ్మె కేవలం కార్మిక,కర్షకుల కోసం మాత్రమే కాదని, ఈ సమ్మె అట్టడుగు పేద ప్రజలను 10.గంటల శ్రమ దోపిడి పని విధానo నుండి రక్షించడం కోసం అని మరియు డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 8 గంటల పని విధానాన్ని అంతటా అమలు చేయడం కోసం అని ఉద్గాటించడం జరిగింది.
అదే విధంగా ప్రభుత్వాలు జీవో 282 ను రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు వత్తసు పలుకుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయాన్నారు ప్రతి కార్మికుడికి ఏయే రంగాల్లో అయితే పనిచేస్తూ ఉన్నారో వాళ్లను పర్మినెంట్ చేస్తూ ఈ.ఎఫ్.పి.ఎఫ్, డి ఎ. లు ఇవ్వాలని దాంతో పాటు సింగరేణిలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించి, వాళ్ల పిల్లలకు సరైన విద్య,వైద్యంను ప్రభుత్వం అందించాలన్నారు.