
“11 మెడల్స్ మరియు పది మంది రాష్ట్ర స్థాయికి ఎంపిక”
(పయనించే సూర్యుడు నవంబర్ 4 రాజేష్)
దౌల్తాబాద్ మండల కేంద్రం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సిద్ధిపేట, తుప్రాన్ పట్టణాలలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి SGF క్రీడల్లో అథ్లెటిక్ అండర్ 19 మరియు రగ్బీ క్రీడలో అండర్ 17 విభాగాలలో గురుకుల కళాశాల మరియు పాఠశాల విద్యార్థులు అథ్లెటిక్స్ మరియు రగ్బీ క్రీడలలో 11 మెడల్స్ సాధించారు . రాష్ట్రస్థాయి క్రీడల కోసం 8 మంది విద్యార్థులు అథ్లెటిక్స్ -8(శివ కుమార్, మాధవ్ , రిశి కుమార్,జశ్వంత్, సంజయ్, చరణ్, చంద్ర శేఖర్, భరత్); రగ్బీ -2(దేవిదాస్, చరణ్) ఎంపిక కావడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం గర్వించదగ్గ విషయమని ఆమె కొనియాడారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు సాయి కృష్ణ, బస్వరాజ్, డాంబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
