
పయనించే సూర్యుడు జులై 16 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :మధ్యాహ్నం 1:00గ,కు ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల నెరవేరబోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ నందు మధ్యాహ్నం 1:00 ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యఏర్పాటుచేసిన సభ నందు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణాల, సమాచార శాఖ మంత్రివర్యులు . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ఇల్లందు శాసనసభ్యులుకోరం కనకయ్య చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ జరుగును కావున మీసేవ నందు అప్రోల్ అయిన లబ్ధిదారులు అందరూ సకాలంలో హాజరు కాగలరు