
కర్ని పి హెచ్ సి డాక్టర్ తిరుపతి కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది
గోవింద్ రాజ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
//పయనించే సూర్యుడు // జూలై2. మక్తల్
మక్తల్ మండలంలోని కర్ని పి హెచ్ సి డాక్టర్ తిరుపతి కి ఆశా వర్కర్లతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి గోవిందరాజ్ మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26, వేల రూపాయలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ దేశవ్యాప్తంగా జులై 9 న జరుగు సార్వత్రిక సమ్మెలో ఆశా కార్యకర్తలు పాల్గొంటారని వైద్య అధికారి తిరుపతి కి మంగళవారం రోజు సమ్మె నోటీసు అందజేశారు. దశబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ చర్యల వల్ల భారత రాజ్యాంగంలో ఆర్టికల్ (19 ) సి ఆర్టికల్ 21, 24,39 డి కి విరుద్ధమైనవి. కోడ్స్ అమలు అయితే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు సంఘటిత ఉపాధి ఉద్యోగ భద్రత పీఎఫ్ ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలకు కార్మికులకు పుట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వ బిజెపి విధానాలు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా జులై 9 జరిగే సమ్మెలో మక్తల్ మండలంలోని అసలు అందరూ పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు గోవిందమ్మ, యశోద, అమీనా బేగం, అనిత స్వప్న, ఇందిరమ్మ, రాధిక, ఆశ బి, తిరుపతమ్మ, బి అనిత, జి వెంకటమ్మ, ఏం రాధమ్మ, ఏ లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు
