
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఏన్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కూడా హైదరాబాద్ చేరుకుని ప్రచార రంగాన్ని చురుకుగా కదిలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలసి, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తరువాత రాష్ట్ర మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు మువ్వ విజయ్ బాబు తో కలిసి జూబ్లీహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలసి ఇంటింటికీ వెళ్లి అభ్యర్థి అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి విజయం కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రజల సమస్యలను పరిష్కరించగలదు అని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి నవీన్, మొగిలి నాగరాజు యాదవ్ , నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
