
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమావేశం
మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసం లో సమావేశం
సోమాజిగూడ డివిజన్ ఇంచార్జిగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
పాల్గొన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సి లు,బీఆర్ఎస్ నాయకులు
(పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
జూబ్లీహిల్స్ లో జరగనున్న ఉపఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత గారు ఘనవిజయం సాదిస్తారని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు,జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు జరగనున్న సందర్బంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి నివాసములో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సిలు నవీన్ రెడ్డి,యల్ రమణ,ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,కార్పొరేటర్ సోమా శేఖర్ రెడ్డి,ఆయా కాలనీ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జూబ్లీహిల్స్ లోని సోమాజిగూడ డివిజన్ ఎన్నికల ఇంచార్జిగా నియమితులైన ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందని,బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని హైదరాబాద్ పట్టణ ప్రజలు మర్చిపోలేరని,ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ కి జూబ్లీహిల్స్ పట్టణ ప్రజలకు గట్టిగా బుద్ధి చెబుతారని,కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఈ ఉపఎన్నికలలో ప్రజలకు వివరిస్తామని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.
