
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంల భీమ్గల్ మండల కేంద్రంలో అంగన్వాడీ ,ఆశ వర్కర్లతో జరిగిన సమావేశంలో జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దామని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిఐటియు జిల్లా నాయకులు కే . దేవగంగు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం కుదించటాన్ని నిరసిస్తూ మొత్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, బిడికార్మికులు సమ్మెకు పిలుపునివ్వటం జరిగిందని. అందువల్ల జరిగే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని మిత్రులకు కనీసం నెలకు 26 వేలు వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సమ్మెను విజయవంతం చేయటానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కన్వీనర్ గా ప్రమీల కోకన్వీనర్ గా లావణ్య, సభ్యులుగా గంగా లక్ష్మి, ఓంకార్ , లావణ్య లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అంగన్వాడి యూనియన్ నాయకులు జ్యోతి, భాగ్య, మరియు అనురాధ ,సమత, సంధ్య, ఆశా వర్కర్లు హేమలత, లక్ష్మి లతా తదితరులు పాల్గొన్నారు.
