
పయనించే సూర్యుడు// న్యూస్// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గం, శాసనసభ్యులు,పర్ణిక రెడ్డి ,జిల్లా కలెక్టర్ శిక్త పట్నాయక్. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. పాల్గొన్నారు.మంత్రివర్యులు, ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైసింగ్,2047 విజన్’ ఆధారంగా అభివృద్ధి పథంలో దృఢంగా ముందుకు సాగుతోంది. అని ఈ విజన్‌లో పేదల సంక్షేమం, సమగ్ర, ప్రజా పాలసీలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక సుపరిపాలన, ఈ నాలుగు ప్రధాన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ లక్ష్యాల సాధనకు వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, వంటి ముఖ్య విధానాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తులో తెలంగాణ రూపురేఖలను సమూలంగా మార్చబోతుంది. అని ఆడబిడ్డల సాధికారత, రైతులకు రుణమాఫీ, నిరుపేదలకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం, యువతకు ఉపాధి అవకాశాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హైదరాబాద్‌కు అంతర్జాతీయ హంగులు, ఇవన్నీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కీలక కార్యక్రమాలు. నారాయణపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులం కావాలని అభివృద్ధి కొనసాగడానికి శాంతి భద్రతలు అత్యంత అవసరమని. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్న జిల్లా పోలీసు,యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు. తెలిపారు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులు, మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని అన్నారు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఘన నివాళులు అర్పించారు. చివరిగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రగతికి అందరం పునరంకితమై, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం, అంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు మరియు జిల్లా ప్రజలు పాల్గొన్నారు.

