
బిజెపి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
పయనించే సూర్యుడు జులై24 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మండలంలో జడ్పిటిసి, ఎంపిటిసి కార్యాచరణ కార్యక్రమం బిజెపి పార్టీ టేకులపల్లి మండల అధ్యక్షులు తేజావత్ శంభు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మండల ప్రబారిగా బుక్య శ్రీను నాయక్, బిజెపి టీచర్ సెల్ జిల్లా కన్వీనర్ వాంకుడోత్ హాతిరాం నాయక్, బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ధరావత్ బాలాజీ నాయక్, టేకులపల్లి మండల కన్వీనర్ భూక్యా రవి రాథోడ్, బిజెపి మండల నాయకులు బోడా పుణ్య నాయక్, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు ఇస్లావత్ రాములు నాయక్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ టేకులపల్లి మండలంలో ఉన్న బిజెపి కార్యకర్తలు జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ప్రతి గ్రామంలో బిజెపి పార్టీని బలోపేతం చేయాలని బిజెపి పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం ఇచ్చారు, బిజెపి పార్టీ అమలు చేస్తున్న పథకాల గురించి కార్యకర్తలకు వివరించడం జరిగింది, రానున్న ఎన్నికల్లో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర అధ్యక్షులు అందరూ సంసిద్ధంగా ఉండాలని కోరారు, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ నాగేందర్ నాయక్, మండల సీనియర్ నాయకులు చిక్కగారు, అన్వేష్ గారు, సత్యం, ముల్త్యా నాయక్ గారు, కిసాన్ మోర్చా నాయకులు రాందాస్ నాయక్, జాటోత్ ప్రకాష్ నాయక్, జమాల్, సురేష్, అప్పారావు, నవీన్, వీరస్వామి, బాలకృష్ణ, రాంబాబు, జరపల ప్రసాద్ నాయక్, బోడ సూరి తదితరులు పాల్గొన్నారు
