
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే. 7
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లోని చట్టి పంచాయితీ శివాలయం గుంపులో బుధవారం త్రాగునీటి బోర్ నకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ 18000 విలువగల బోర్ హేండిల్, 7 పైపులు, 7.రాడ్లు, కాప్లింగిల్ లు గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా జమాల్ ఖాన్ మాట్లాడుతూ వేసవి లో గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తీవ్రంగా ఉందని అందుకు గాను గ్రామాల్లో ని మరమ్మాతులకు గురైన మంచినీటి బోర్ లను ప్రెస్సింగ్ చేయించాలని దానికి తాను స్వయంగా మారామ్మతులు చేయించటం జరుగుతుందని తెలిపారు. త్రాగు నీటి సమస్యలు ఎక్కడైనా తీవ్రంగా ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో జే. కె. సి. టి ట్రస్ట్ సభ్యులు చట్టి గ్రామస్తులు ముత్తయ్య, నాయకులు ముత్యాల రామారావు, పి. సాల్మానరాజు, జాఫర్, తదితరులు పాల్గొన్నారు.