
అధికారికంగా ప్రకటించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్.
పయనించే సూర్యుడు: మే 01: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ .
మంగపేట: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచనల మేరకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మంగపేట జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి మండల ఇన్చార్జిగా గుమ్మడి సోమయ్య నీ అధికారికంగా నియమించారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచన మేరకు ఈ రెండు మండలాలకు ఇంచార్జి లను మార్చడం జరిగిందనీ, అదేవిధంగా.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి రాహుల్ గాంధీ పిలుపునిచ్చారని అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించరని తెలియజేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్ళాల్సిన అసవరం ఉందన్నారు. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విధానాలను రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు. బీసి కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకువస్తుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. కార్యకర్తల పోరాట ఫలితంగా నే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రజా ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు మహాలక్ష్మి తో ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ తో 5 నుండి 10 లక్షలు పెంపు, గృహ జ్యోతి పథకం నుండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గుడులేని నిరుపేద లకు ఇందిరమ్మ ఇండ్లు, రికార్డ్ స్థాయి లో ఉద్యోగ భర్తీలు, రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, వరి సాగుకు క్వింటాకు 500 రూపాయలు బోనస్, బీసీ రిజర్వేషన్, ఎస్సి వర్గీకరణ, ఇలా మన ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ధి ప్రజలకు వివరిస్తు కార్యకర్తలు, నాయకులను సీనియర్ మరియు జూనియర్, చిన్న , పెద్ద అందరినీ సమన్వయము చేస్తూ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.