
పయనించే సూర్యుడు మార్చ్ 25 జిల్లా బ్యూరో టి కే గంగాధర్ :నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడు శివకుమార్ సిరికొండ మండలానికి ఇన్చార్జిగా చేపట్టాడు.తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో సిరికొండ మండలంలో కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి అధ్యక్షతనములో జరిగింది. ఇట్టి సమావేశానికి మండల కార్యక్రమ ఇంచార్జ్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ పాల్గొని మాట్లాడారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేర జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమములో భాగముగా రూట్ మ్యాప్ నిర్ణయించటానికి ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. మండల నాయకులు, కార్యకర్తలు నిర్ణహించిన రూట్ మ్యాపు ప్రకారం ప్రతి నాయకులు, కార్యకర్తలు కష్టపడి విజయంతం చేసి ప్రజలకు జై బాపు జై భీమ్ జై సంవిదాన్ ఉద్దేశ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తూ పాదయాత్ర ద్వారా ముందుకు వెళ్ళాలని కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని గుర్తింపు ఇస్తుందని అలాగే రాబోవు స్థానిక ఎన్నికలలో విజయం సాధించాలన్నా స్థానిక ఎమ్మెల్య రేకులపల్లి భూపతి రెడ్డి అన్న నాయకత్వం బలపరిచే విధముగా ఈ కార్యక్రమాన్ని విజయంతం చెయ్యాలని శివకుమార్ తెలియజేశారు. రూట్ మ్యాప్ తర్వాత పాదయాత్ర ప్రారంభానికి ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కార్యక్రమ అన్ని విషయాలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కి వివరిస్తారు దాని ప్రకారం అందరూ కలిసికట్టుగా కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళాలని కోరినారు. ఇట్టి కార్యక్రమములో సిరికొండ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు