
సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు అందుబాటులో – కూటమి ప్రభుత్వం సంక్షేమ కృషి
పయనించే సూర్యుడు న్యూస్. సెప్టెంబర్ 14. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్.చిరంజీవి)
గొలుగొండ మండలం జోగంపేట రైతుసేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమృద్ధిగా ఎరువులు, ఫెర్టిలైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎరువులు, ఫెర్టిలైజర్లతో పాటు పురుగుమందులు కూడా అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుర్ల సీతరామమూర్తి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లేటికుర్తి రమేష్, మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు గండేపల్లి రాము, పెదిరెడ్ల మల్లేశ్వరరావు, జువ్వల దేవుడు, విఆర్వో నారాయణమూర్తి, అగ్రికల్చర్ అసిస్టెంట్ శివ, గ్రామీణ పోలీసులు లోవ కన్య, గుడివాడ మురళి పాల్గొన్నారు.