
పయనించే సూర్యుడు మార్చి 9 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో కూలిన ఎస్ఎల్ బీసీ, టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది, ప్రమాదానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
ఎస్ఎల్ బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి2 పాయింట్ లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించి నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతు అయిన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే ఛాన్స్ ఉంది. ఆనవాళ్లు లభించడాన్ని ఇంకా అధికారులు అధికారి కంగా ప్రకటించలేదు.