
ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలి….
రైతు, ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు
పయనించే సూర్యడు // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ ( హుజురాబాద్ )..
సినిమా రంగంపై తనదైన ముద్ర వేసి, క్షణం తీరికలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాటి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే లక్ష్యంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.ఎన్టీఆర్ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఎనలేని కీర్తి సాధించారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చెప్పి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకి దక్కిందని, ఇది దేశ రాజకీయ చరిత్రలోనే లిఖించదగిన పరిణామం అని రామారావు తెలిపారు.తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ బైపాస్ రోడ్డు లోని ఎన్టీఆర్ విగ్రహానికి పోలాడి రామారావు నాయకుల తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అధినేతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెన్నిధిగా నిలిచారని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో వాటా, రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మండలాల ఏర్పాటు, ట్యాంకు బండ్‌పై విగ్రహాలు, హుస్సేన్‌సాగర్‌లో అతిపెద్ద బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు నేతృత్వంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించి 9 నెలల్లోనే అధికారం లోకి వచ్చి సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ప్రజలే దేవుళ్లుగా భావించి రైతుల,బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి,రాష్ట్రాభివృద్ధికి, ఎంతో కృషి చేశారన్నారు.
బీసీలలో రాజకీయ చైతన్యం తెచ్చిన గొప్ప మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తెలుగు దేశం స్థాయిలోప్రజలను ప్రభావితం చేయలేదని,జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగు దేశం పార్టీ మాత్రమేనని అన్నారు.భూస్వామ్య, బూర్జువా పెత్తందారి వ్యవస్థకు చరమ గీతం పాడే విధంగా పటేల్ పట్వారీ వ్యవస్థ రైతులకు భూశిస్తు రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలెన్నో ఆయన తీసుకున్నారని రామారావు తెలిపారు.పంచాయతి సమితి వ్యవస్థలను రద్దు చేసి, ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేశారని రామారావు చెప్పారు.ఎన్టీఆర్ పరిపాలనను చూసి ఓర్వలేక ఆనాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు 1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేయగా, ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా పోరాటంతో నెల రోజులకే మళ్లీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేశారు. 1984 లో అప్పటి ప్రధాని ఇందిరగాంధీ హత్య అనంతరం జరిగిన లోకసభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 30 లోక్ సభ సీట్లు సాధించి లోక్ సభ లో ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్రను పోషించిందని అన్నారు.
ఆ తరువాత రాజకీయ పరిణామాల పార్టీ భవిష్యత్ కోసం నాయకులు, పార్టీ కార్యకర్తల ఆకాంక్ష మేరకు 1995 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, తెలుగు దేశం పార్టీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి జాతీయ భావాలతో విశేష కృషి చేశారని రామారావు కొని యాడారు.తెలుగు దేశం పార్టీ తరపున ఎం ఎల్ ఏ లు గా మొదటిసారి గెలిచిన కేసీఆర్ ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు .ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎం ఎల్ ఏ గా గెలుపొందిన వారేనని రామారావు అన్నారు . ఒక రకంగానవతరం రాజకీయ నాయకులను తీర్చి దిద్దే ఫ్యాక్టరీ గా తెలుగు దేశం పార్టీ కి పేరుందని, ఎందరో బడుగు బలహీనవర్గాలకు చెందిన సామాన్య యువకులకు, గ్రాడ్యుయేట్లకు, అడ్వకేట్ అవకాశం కల్పించి ప్రజా ప్రతినిధులు గా తెలుగు దేశం పార్టీ గెలిపించిందన్నారు. కార్యకర్తల బలం తెలుగు దేశం పార్టీ కి పెట్టని కోట అని కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ జాతీయ ప్రథాన కార్యదర్శి నారా లోకేష్ 5 లక్షల జీవిత భీమా కల్పించడం మంచి పరిణామమని కొనియాడారు. యావత్ తెలుగు ప్రజల అభ్యున్నతి, తెలుగు జాతి శ్రేయస్సే తెలుగు దేశం పార్టీ లక్ష్యంగా పనిచేస్తుండటం మమ్ములను ఎంతో ఆకర్షించిందని పోలాడి రామారావు ఆనందం వ్యక్తం చేశారు.బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ఇవ్వాలని పోలాడి రామారావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
