
నగరి గారి ప్రీతం చేతుల మీదుగా నియామక పత్రం అందజేత.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 4, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. హైదరాబాద్ లోనీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ & టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగరీగారి ప్రీతం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంగిటి నరేష్ ని బుధవారం టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జంగిటి నరేష్ మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డా తనను గుర్తించి ఇంత గొప్ప అవకాశం కల్పించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు జనగామ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మరియు ఎంపీటీసీల ఫోరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆరే ప్రశాంత్ గౌడ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అభ్యున్నతికి కృషి చేస్తానని తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తనని ఎల్లవేళలా ప్రోత్సహించి సహకరించిన నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిధే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఉపచారి ఉప సర్పంచ్ మల్లేష్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ వార్డ్ మెంబర్లు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, యూత్ నాయకులు అందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, అన్ని స్థాయిలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.