
పయనించే సూర్యుడు అక్టోబర్ 01 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి, టిప్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చుక్కల బోడు వద్ద యూనియన్ ఆఫీసులో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని డ్రైవర్లకు, యూనిఫామ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆఫీసులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. టిప్పర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు నేలవేల్లి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ డ్రైవర్లు ఈయొక్క యూనిఫామ్ ని ధరించి విధులకు హాజరు కావాలని అప్పుడే వారికి డ్రైవర్లుగా గుర్తింపబడ తారని అన్నారు.డ్రైవర్లు రోడ్డుమీద డ్రైవింగ్ చేస్తూ సెల్ పోన్ మాట్లాడకుండా నడపాలన్నారు. అత్యవసరమైతే లారీ పక్కకు ఆపి ఫోన్ మాట్లాడాలని వారు కోరారు. డ్యూటీలో బాధ్యతగా ఉండాలని తాగి డ్రైవింగ్ చేయొద్దని వారు డ్రైవర్ల కి విజ్ఞప్తి చేశారు.ఈమధ్య ఇల్లందు, కే ఓసి లో బొగ్గు లోడింగ్ తగ్గడం వలన ఓనర్లు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. లోడింగ్ పెంచేందుకు ఓసి ప్రారంభమ వ్వాల్సి ఉందని వారు తెలియజేశారు. ఓనర్లు డ్రైవర్లు ఐక్యంగా ఉండి పరస్పరం సహకరించుకోవాలని తెలియజేశారు. టిప్పర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కోరం సురేందర్ మాట్లాడుతూ ప్రధానంగా డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని కోరారు సీనియర్ డ్రైవర్ రాజేష్ ను శాలువతో సన్మానించి యూనిఫామ్ అందజేశారు.టి యు సి ఐ అనుబంధం మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాయం వెంకన్న పాల్గొని మాట్లాడుతూ యూనిఫామ్ ముఖ్యమైనదని లారీని డ్యూటీ ఎక్కేటప్పుడు ఎలా అయితే చెక్ చేసుకుంటామో యూనిఫామ్ కూడా వేసుకుని మాత్రమే డ్యూటీ ఎక్కాలని కోరారు.లోడింగ్ లేని సమయంలో యాజమానులు ఇబ్బందుపడుతున్నటువంటి పరిస్థితులలో150 మంది డ్రైవర్లకు ఇవాళ యూనిఫామ్, ఇవ్వడం మంచి పరిణామామని టిప్పర్ అసోసియేషన్కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, ఇల్లందు బాడీ లారీ అసోసియేషన్ అధ్యక్షులు, షేక్ మౌలానా, కోశాధికారి ఎండి రషీద్, పాషా, టేకులపల్లి కార్యదర్శి ఆరవ వెంకటేష్ బుగ్గ రమేష్, నరేష్ అజ్మీరా నరేష్,టి యు సి ఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, టేకులపల్లి ఏరియా కార్యదర్శి జరుపుల సుందర్,టిప్పర్ డ్రైవర్లు పాల్గొన్నారు.