
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్.టీఎస్ జేఏ సూర్యాపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా,బచ్చలకూరి వెంకన్న నియమితులయ్యారు.టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి అన్న సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గల అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో,వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి అన్న చేతుల మీదగా బచ్చలకూరి వెంకన్న తన యూనియన్ కార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బచ్చలకూరి వెంకన్న మాట్లాడుతూ,నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి అన్నకు రాష్ట్ర కమిటీకి,జిల్లా కమిటీకి,మరియు సూర్యాపేట పట్టణ కమిటీకి సీనియర్ జర్నలిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం,వారి హక్కుల పరిరక్షణ కోసం నావంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.టీఎస్ జేఏ
రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ,బచ్చలకూరి వెంకన్న నియామకం సంస్థకు మరింత బలం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీఎస్ జేఏ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో టిఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాంబాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దుర్గం బాలు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి శ్రీనివాస్,సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కొమ్మగాని సైదులు గౌడ్,కమిటీల సభ్యులు మరియు స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.
