
డీటీసీఓ రవీందర్ రెడ్డి..
పయనించే సూర్యడు //ఫిబ్రవరి 12//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. భారత ప్రభుత్వం చేపట్టిన టీబి ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టీబి ముక్త్ గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా నేడు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో నిక్షయ్ శిబిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో టిబి లక్షణాలు ఉన్నవారికి ఆధునిక యంత్రం,ట్రూనాట్.మిషన్ ద్వారా టిబి పరీక్షలు నిర్వహించినారు. అవసరమయిన వారికి (క్సరే )లు కూడా తీసారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా..రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో ఎక్కువగా దుమ్ము, ధూళి, పొగ ఉన్న ప్రాంతాలలో పని చేయాల్సి వస్తుంది కనుక టిబి వ్యాధికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు చేయించుకోవాలని టిబి రహిత భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా..రవీందర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ రాజి రెడ్డి,వావివాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా..చందన, డా..కార్తిక్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి,హెల్త్ సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ, టిబి సూపర్వైజర్ దేవేందర్ రెడ్డి , శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్,మెప్మా ఎడిఎంసీ మానస, పీపీఎం,కో ఆర్డినేటర్ అశోక్ ఆరోగ్యశాఖ సిబ్బంది రాధా,నరేందర్ మరియు ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు
