
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 7:- రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారి 16 మీద మార్టూరు మండలం జొన్న తాళి సర్వీసు రోడ్డులో జొన్నతాలి నుండి మార్టూరు వస్తున్న టూవీలర్ ను మార్టూరు నుండి గ్రానైట్ స్టోన్ లోడుతో వెళ్తున్న గూడ్స్ లారీ ఢీకొట్టడంతో పల్సర్ బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చిన మార్టూరు సీఐ శేషగిరిరావు గూడ్స్ లారీ ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు మార్టూరు లోని తూర్పు బజారుకు చెందిన బత్తుల రమేష్ బాబు (43) బాబుగా పోలీసులు గుర్తించారు. కాగా రమేష్ బాబు గ్రానైట్ ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన మార్టూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.