
పయనించే సూర్యుడు ఆగస్టు 15 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. టేకులపల్లి తాసిల్దార్ ఆఫీస్ తాహాసిల్దారు లంకపల్లి వీరభద్రం, ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీడీవో మల్లేశ్వరి, మరియు పోలీస్ స్టేషన్ లో సీఐ బత్తుల సత్యనారాయణ, బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో లక్కినేని సురేందర్ రావు ఆధ్వర్యంలో మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ పాల్గొన్నారు. అనంతరం వివిధ శాఖల సిబ్బంది మాట్లాడుతూ.ఎందరో త్యాగాల పోరాటాల ఫలితమే నేడు స్వసంత్రం సిద్ధించిందని. స్వతంత్ర ఫలాలు రేపటి భావితరాలకు నిలిచేలా యువతకు దేశభక్తి పెంపొదించేలా ఉండాలని. దేశం కోసం జరిగిన పోరాటం త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియ చెప్పాలని అందరూ కలిసిమెలిసి సోదరరా భావంతో కలిసి ఉండాలని వారి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మండలంలో ప్రశాంత వాతావరణంలో 79వ స్వతంత్ర దినోత్సవ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.