
పయనించే సూర్యుడు మార్చి 25 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు ) చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ కు చెందిన సింగరేణి కార్మికుడు అహ్మద్ రజాక్ ఫాతిమా దంపతుల రెండో కుమారుడు అయిన ఎండి హఫ్రీద్ వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నాడు ప్రస్తుతం టేకులపల్లి మండల కార్యాలయంలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న అఫ్రిద్ బిఈ మెకానికల్ ఇంజనీరింగ్, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి గతంలో RRB, NTPC లలో ఉద్యోగములను సాధించి ప్రస్తుతం టేకులపల్లి మండల తహశీల్దార్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ గ్రూప్ 4 జిల్లాలో 3వ ర్యాంక్ సాధించి గ్రూప్ వన్ లో 448 మార్కులు గ్రూప్-2 లో 377 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 313 ర్యాంక్ గ్రూప్ త్రీ లో 22వ ర్యాంకు సాధించడం విశేషం ఒక జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 21 ర్యాంకు సాధించిన అఫ్రిద్ కు టేకులపల్లి మండల తహశీల్దార్ నాగ భవాని డిటి ముత్తయ్య ఆఫీస్ స్టాఫ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మరియు కార్యాలయ సిబ్బంది అందరూ వారికి అభినందిస్తూ సన్మానించడం జరిగింది. మరియు కార్యాలయం లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అందులో అందరూ పాల్గొనడం జరిగింది.