
పయనించే సూర్యుడు మే 19 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి గ్రామ పంచాయతీ కి ప్రత్యేక అధికారిని నియమించాలని టేకులపల్లి గ్రామ పంచాయతీ 1వ వార్డు తాజా మాజీ సభ్యులు ప్రగతిశీల యువజన సంఘం పి. వై. యల్ తెలంగాణ రాష్ట్ర సహాయ నోముల భానుచందర్ సంబందిత అధికారులను కోరుతున్నారు. గతంలో టేకులపల్లి గ్రామ పంచాయతీ కి ప్రత్యేక అధికారి గా ఉన్న మండల యం. పి. డి.ఓ రవీందర్ వ్యక్తిగత సెలవుల్లో వెళ్ళాడం ద్వారా అప్పటి నుండి టేకులపల్లి గ్రామ పంచాయతీ కి సంబంధించిన పనులు జరగటం లేదని వారు తెలియజేశారు, గ్రామంలో ఎక్కడ చూసినా వీధి లైట్లు,బ్లీచింగ్ లేక గ్రామస్థులు ఆగ్రహంతో ఉన్నారు.ఇప్పుడు ఏ పని చేపించాలన్న సర్పంచ్ స్థానంలో ఉన్న ప్రత్యేక అధికారికి తెలియజేయాల్సి ఉంది. టేకులపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కి ప్రత్యేక అధికారి లేకపోవడం వల్ల చాల పనులు ఖర్చులతో ముడిపడి ఉన్నందున పెండింగ్ పడుతున్నాయి. ఇకనైనా గ్రామ పంచాయతీ లో అత్యవసర సేవలు కొనసాగేలా వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి టేకులపల్లి గ్రామ పంచాయతీ ని అభివృద్ధి చేయలని ప్రజలు కోరుతున్నారు.