
ఏపీఎం కే రాష్ట్ర అధ్యక్షులు మెంతిన ప్రభాకర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 05 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్118.వ జయంతి కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎంకే రాష్ట్ర అధ్యక్షులు మంతెన ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక మంత్రిగాను మరియు 1971 రెండో పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగ ఉన్నారు ఆ ఫలితంగానే బంగ్లాదేశ్ ఏర్పాటుకు మార్గం సుఖము ఏర్పడింది భారతదేశంలో హరిత విప్లవం భారత వ్యవసాయాన్ని ఆధునికరించడంలో అతను అందించినటువంటి సేవలు అమోఘము వ్యవసాయ మంత్రిగానూ ఒకే టైంలో తన రెండు పదవులు పదవి కాలాము 1974 నా కరువు సమయంలో నారా సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుని సంఘసంస్కర్త అయినటువంటి బాబు జగ్జీవన్ రావు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుజ్జునూరి ఏసయ్య మరియు గుజ్జునూరి పవన్ కొంగర చంద్రశేఖర్ పాయం లెనిన్ ఈసం అభి ఈసం శేఖర్ తదితరులు పాల్గొన్నారు