
పయనించే సూర్యుడు జూలై 28 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడవ మహాసభలు అశ్వరావుపేట పట్టణంలో జరుగుచున్నాయి. ఈ మహాసభలు టేకులపల్లి మండలం కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ మాట్లాడుతూ మండలంలో 12 గ్రామ నూతన శాఖలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసి మండల మహాసభ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రజా సంఘాలను నూతన కమిటీలు ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని. మండలంలోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు. ఔట్సోర్సింగ్ కార్మికులు హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని తెలిపారు. మండల రిపోర్ట్ ను జిల్లా మహాసభలో తెలియపరచి మరింత పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేశాను ఈ మహాసభ వేదిక లో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జిల్లా కార్యవర్గ సభ్యులు కే సారయ్య తదితరులు పాల్గొన్నారు