
పయనించే సూర్యుడు జూన్ 3 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పోలీస్ శాఖలోని (పి ఎం జి ) పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ మెడలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మీనుగు భాస్కరరావు మెడల్ ను అందుకున్నారు. మీనుగు భాస్కర్ రావు ఒక మారుమూల గ్రామంలో నివసించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంతో కష్టపడి పోలీస్ శాఖలో ఉద్యోగం పొంది ఆ ఉద్యోగంలో నీతి నిజాయితీలతో నిసులుకోవడం వలన అతని నిజాయితీని గుర్తించి పోలీస్ శాఖలోని అరుదైన పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. వచ్చిన అవార్డుకు స్వగ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఎండ్ న్యూస్