
పయనించే సూర్యుడు ఏప్రిల్ 07టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు శంభు నాయక్ అధ్యక్షతన బీజేపీ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం వేడుక ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.జన సంఘ్ నుండి బీజేపీ పార్టీగా అవతరించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్యం కలిగిన పార్టీగా అవతరించి దేశంలో 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామని 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గరిబ్ కళ్యాణ్ అన్న యోజన స్వచ్ఛ భారత్ పీఎం కిసాన్ ట్రిపుల్ తలాక్ వాక్స్ బోడ్ ఆర్టికల్ 317 రద్దు మొదలైన అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, బీజేపీ నాయకులు హాథీరామ్ నాయక్, సీనియర్ నాయకులు చిక్క వెంకటేశ్వర్లు, మంత్య నాయక్, జిల్లా నాయకులు పుణ్య నాయక్, మండల ప్రధాన కార్యదర్శి బాధావత్ సురేష్ నాయక్, వెంకటేశ్వర్లు, రాజు, నరేష్, జామాల్, అప్పారావు. వినోద్ తదితరులు పాల్గొన్నారు.