
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్29//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//నారాయణపేట జిల్లా
మక్తల్ సమీపంలో నిర్మించిన నూతన టోల్ గేట్ కు కాచ్ వార్ పేరు పెట్టారని అది తీసివేసి తమ గ్రామం పేరు పెట్టాలని టేకులపల్లి వాసులు టోల్ గేట్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సంబందిత అధికారులు వెంటనే స్పందించి మా యొక్క సమస్యకు పరిష్కారం చేయకపోతే మా నిరసనను కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం మక్తల్ తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో టేకులపల్లి వాసులు పాల్గొన్నారు.
