పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆత్మకూరు సిఐ గంగాధర్ . చర్యలు చేపట్టారు. మున్సిపల్ బస్టాండ్ నూతనంగా నిర్మించినప్పటి నుండి బస్టాండ్ ఆవరణంలో అడ్డు అదుపు లేకుండా ఆటోలు ఇతర వాహనాలు విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తూ ఆటు ఆర్టీసీ బస్సులకు ఇటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది గుర్తించిన ఆత్మకురు సిఐ గంగాధర్ ఆటో వాలాలతో మాట్లాడి బస్టాండ్ ఆవరణంలోని సులబ్ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ హద్దులు ఏర్పాటు చేసి హద్దులలోనే ఆటోలు, ఇతర వాహనాలు నిలపాలని తెలిపారు. పార్కింగ్ హద్దులలో కాకుండా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన వెంట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు