
ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫోటో..
రుద్రూర్, ఏప్రిల్ 2 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు అయ్యాయని బుధవారం మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పత్తి రాము మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఒక వారం లోపల ఇట్టి బిల్లులు పంచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రుద్రూర్ మండల కేంద్రానికి ఎస్సీ సబ్ ప్లాన్ లో నిధుల నుండి 50 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీలు మంజూరయ్యా యని ఆయన పేర్కొన్నారు. ఇట్టి నిధులు మంజూరు కు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి రుద్రూర్ మండల ప్రజల తరఫున, పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.