
బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు..
పయనించే సూర్యుడు// ఫిబ్రవరి 6// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
బేడ బుడగ జంగం,జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు మాట్లాడుతూ..గతంలో సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో సానుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ఏడుగురితో కూడిన ధర్మస్థానానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ,2024 సంవత్సరంలో కుల గణన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5 తారీకు నాడు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు, ఎస్సీ ఏకసభ్య కమిషన్ డాక్టర్ షమీం అత్తర్ కి వారి బృందానికి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి మూడు విభాలుగా ఏ బి సి చేసినారు,ఏ,కేటగిరిలో 15 సంచార జాతులను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించారు. 50 శాతం ఆనందంతో 50% బాధతోఈ సంచార జాతులు ఉండడం జరిగిందన్నారు.ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2011 జనాభా ధమాస ప్రకారం చేసినందుకు బాధా కలుగుతుందన్నారు..ఆనందం ఎందుకంటే 17 లక్షల పైగా ఉన్న సంచార జాతులకు.1 పర్సెంట్ కేటాయించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాం, అని బిసి సమాజ సామాజిక వర్గానికి సంబంధించి కుల గణన ఆధారంగా వారికి రిజర్వేషన్ కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ వర్గానికి కూడా కుల గణన ఆధారంగా రిజర్వేషన్ కేటాయించినట్టయితే ,ఏ,లో ఉన్న 15 కులాలకు, 3 పర్సంటేజీ వచ్చేదాన్ని మేము నమ్ముతున్నాము అన్నారు.ఎందుకంటే 2011 నుండి,2024 మధ్యలో 13 సంవత్సరాలు తేడా ఉంది గనుక.3. పర్సంటేజ్ వస్తుంది, అని కుల గణన ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ మరో మారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్ లో ఏర్పాటు చేసి వాటికి చైర్మన్ కూడా నియమించారు. వెనుకబడ్డ ఉపకులాలైన వారికి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు.అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 76, సంవత్సరాలు గడుస్తున్నా మా బేడ బుడగ జంగాలు ఇప్పటికి 80 శాతం పూరి గుడిసెలో నివసిస్తున్నారు. కనుక ఇందిరమ్మ ఇళ్లల్లో మా బేడ బుడగ జంగాలకు 20 శాతం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో, మరో 20 శాతం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు . అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో ప్రతి కులానికి కమిటీ హాలు ఉన్నాయి. కనుక తెలంగాణ రాష్ట్ర నాలుమూలల నుండి వివిధ పనుల విషయంలో మా బేడ బుడగ జంగాలు హైదరాబాద్కు వచ్చి, రైల్వే స్టేషన్లలో,బస్ స్టేషన్ లొ,ప్లాట్ ఫామ్ లో పైన, వివిధ రకాలుగా నానా ఇబ్బందులు పడుతున్నాం, కనుక వెంటనే హైదరాబాదులో వేయి గజాల స్థలం ఇచ్చి ,కమిటీ హాలు నిర్మించి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.2011 జనాభా సర్వే చేస్తున్నప్పుడు సంచార జాతులకు సంబంధించిన వారు జనాభా సర్వేలో పాల్గొనలేదు ,ఆ కారణంగా జనాభా లెక్కలు తక్కువగా వచ్చాయి, అదేవిధంగా పంబాల , మన్నే , కులాల వారిని ఏ కేటగిరీలో కేటాయిస్తూ ప్రభుత్వం చూపెడుతుంది, పంబాల , మన్నే కులాలవారు, విద్య వైద్యం ఉద్యోగం, ఉపాధి , ఆర్థికగా అనేక రంగాల్లో ముందున్నారు. వారిని ఏ కేటగిరి నుండి తొలగించి వెనుకబడ్డ కులాలైన దాసరి, హోలీయ దాసరి, కులాలను ఏ కేటగిరిలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.