
పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్.15/10/25, .
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం జీడిగుప్ప రాష్ట్ర వ్యాప్త వైద్య ఆరోగ్య శాఖ పి హెచ్ సి డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనలకు మద్ధతుగా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న అన్ని పి హెచ్ సి లలో సిబ్బంది తో నల్ల బాడ్జిలతో విధులు నిర్వర్థిస్తూ నిరసనలు చేప్పటింది. బుధవారం జీడిగుప్ప పి హెచ్ సి సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమంలో ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారులు మడివి నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మడివి నెహ్రూ మాట్లాడుతూ… ప్రభుత్వల హామీ మేరకు డాక్టర్లకు రావాల్సిన న్యాయమైన బెనిఫిట్స్ సాధనకోసం గత 11 రోజులుగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం పరిష్కరించకపోవడం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురౌతున్నారని, రోగులు ముక్యంగా గర్భిణులు, ప్రసూతి కేసులు, అత్యవసర వైద్యం అవసరమైన కేసులు ఇబ్బంది పడుతున్నారని, ఆ ఒత్తిడి క్రింది స్థాయి సిబ్బందైన క్లినికల్, పారామెడికల్ సిబ్బంది పై తీవ్రంగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే జూనియర్ అసిస్టెంట్ల, సీనియర్ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ లో వైద్యాధికారులుగా డాక్టర్లే సిబ్బంది జీతబత్యాల బిల్లులు చేస్తున్నారు. ఈ డాక్టర్ల ధర్నాల కారణంగా ఈ నెల సిబ్బందికి జీతబత్యాలు అందుతాయో లేదోనని ఆందోళనకు గురూతున్నారు. అందుకే ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డాక్టర్ల ఆందోళనలకు మద్దతుగా నల్ల బాడ్జిలతో విధులు నిర్వహిస్తూ నిరసన చేపట్టమని, ఇప్పటివరకు రోగులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పి హెచ్ సి లలోని క్లినికల్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది చూసుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే డాక్టర్ల సమస్యలను పరిష్కరించి విధుల్లో హాజరయ్యేలా చూడాలని, ప్రజరోగ్య కార్యక్రమాలు,, వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పి హెచ్ సి లలోని క్లినికల్, పారామెడికల్ సిబ్బది కూడా దశలవారీగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ ఆరిక ఉషారాణి, ఎస్ ఎన్ భాగ్యలక్ష్మి, ఫార్మసి ఆఫీసర్ అనిగి ప్రవీన్, ఎల్ టి సౌజన్య, ఎం ఎన్ ఓ పాయం వెంకటేష్, ఫీడర్ ఆంబులెన్స్ డ్రైవర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
